%1$s

‘బ్లాక్ ఫంగస్’ గురించి మీరు తెలుసుకోవాల్సిన 7 విషయాలను గురించి నిపుణుల అభిప్రాయం

About black fungus

దేశంలో కోవిడ్ కేసులు స్వల్పంగా తగ్గినప్పటికి,ముకోర్మైకోసిస్ అని పిలువబడే తీవ్రమైన fungal infection అనేక మందిని ప్రభావితం చేయడం ప్రారంభించింది. సాధారణంగా ‘బ్లాక్ ఫంగస్’ అని పిలువబడే ఈవ్యాధి తరచుగా చర్మంపై కనిపిస్తుంది.  ఊపిరితిత్తులు మరియు మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది.

రాష్ట్రాల వ్యాప్తంగా పెరుగుతున్న మ్యూకోర్మైకోసిస్ కేసులతో, ఈ వ్యాధికి సంబంధించి అనేక ప్రశ్నలు మరియు అపోహలు తలెత్తుతున్నాయి.

“ముకోర్మైకోసిస్ అనేది అరుదైన  ఇన్ఫెక్షన్ మరియు ఇది రోగిని ప్రభావితం చేసినప్పుడు, అది నలుపు రంగులో కనిపిస్తుంది.అందువలన “ బ్లాక్ ఫంగస్” అనే పేరు వచ్చింది, అని

 యశోదా హాస్పిటల్స్, క్రిటికల్ కేర్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్, క్లినికల్ డైరెక్టర్, డాక్టర్ వెంకట్ రామన్ కోలా నమ్రతశ్రీవాస్తవతో ఒక ఇంటరాక్షన్ లో వివరించారు.

మ్యూకోర్మైకోసిస్(mucormycosis) అంటే ఏమిటి?

ముకోర్మైకోసిస్ అనేది అరుదైన ఇన్ఫెక్షన్ . ఇది సాధారణంగా మట్టి, మొక్కలు, ఎరువు మరియు

 కుళ్లిన పండ్లు మరియు కూరగాయలలో కనిపించే మ్యూకోర్ మౌల్డ్  వల్ల కలుగుతుంది. ఇది సైనస్ లు, మెదడు మరియు ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది .

మరియు క్యాన్సర్ రోగులు లేదా హెచ్ఐవి/ఎయిడ్స్ ఉన్న వ్యక్తులు , డయాబెటిస్ లేదా తీవ్రంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తుల్లో ప్రాణాంతకంగా ఉండవచ్చు.

ఈ వ్యాధి ఎంత ప్రబలంగా ఉంది?

సాధారణంగా,  కోవిడ్ రావడానికి ముందు  కాలంలో, మధుమేహం మరియు రోగనిరోధక శక్తిని కోల్పోయిన  రోగుల్లో మ్యూకోర్మైకోసిస్ కనిపించింది. ఈఫంగస్ వాతావరణంలో ఉన్నప్పటికీ మరియు దానినుండి రక్షించడం సాధ్యం కానప్పటికీ, చాలా అరుదుగా ఇది ఆరోగ్యవంతమైన వ్యక్తిని ప్రభావితం చేస్తుంది.

ఈ ఫంగస్ రోగులపై ఏవిధంగా ప్రభావం చూపుతుంది?

ఈ ఫంగస్, sinus-maxillary, ఎథ్మాయిడ్, స్ఫినాయిడ్, మరియు ముందు ఉన్నఊపిరితిత్తులు, మెదడు మరియు కాలేయం వంటి కొన్ని ఇతర అవయవాల యొక్క వివిధ భాగాలను ప్రభావితం చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన ఫంగస్ . రోగి దానిని  పీల్చిన తరువాత అది  సైనస్ ల లోపలకు చేరుతుంది . మధుమేహం మరియు క్షీణించిన రోగనిరోధక వ్యవస్థ  సమస్యలతో ఉన్న రోగిలో, ఈ ప్రాంతాల్లో ఇది చాలా వేగంగా పెరుగుతుంది. ఇది రోగి యొక్క కళ్లు మరియు ముక్కు దగ్గర మాంసం, కణజాలాలు మరియు ఎముకలను క్షీణింప చేస్తుంది.  ఇది ఊపిరితిత్తుల న్యుమోనియా (pneumonia) కి  కూడా కారణం కావచ్చు.

కొవిడ్ రోగుల పై మ్యూకోర్మైకోసిస్ ఎందుకు ప్రభావం చూపుతోంది?

కోవిడ్ రోగుల్లో రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు ఉంటాయి. ఒకవేళ రోగికి మధుమేహం కూడా ఉన్నట్లయితే, అప్పుడు వారి చక్కెర స్థాయిలు పెరుగుతాయి. నాన్ డయాబెటిక్ లేదా ప్రీ డయాబెటిక్ రోగుల్లో కూడా ఇది జరుగుతోంది. మధుమేహం శరీరరోగనిరోధక శక్తిని  తగ్గిస్తుంది.

అదే సమయంలో, కోవిడ్-19తో పోరాడటానికి సహాయపడటానికి, రోగులకు స్టెరాయిడ్లు సిఫారసు చేయబడతాయి, స్టెరాయిడ్ల వాడకం రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది,డయాబెటిక్ మరియు non – diabetic కోవిడ్-19 రోగుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను(blood sugar levels) పెంచుతుంది.

 రోగనిరోధక శక్తిలోని తగ్గుదల మ్యూకార్మైకోసిస్ కేసులు పెరగడానికి కారణం కావచ్చు.

 

మ్యూకార్మైకోసిస్ యొక్క లక్షణాలు ఏమిటి?

రోగి ముక్కుదిబ్బడ , ముక్కు మూసుకు పోవడం గురించి ఫిర్యాదు చేస్తాడు,నలుపు లేదా bloody nasal discharge ఉంటుంది . కొంతమంది రోగుల్లో చెంపపై  నొప్పి ఉండవచ్చు. ముక్కు చుట్టూ  చర్మం పై నల్లటి  మచ్చలు ఉండవచ్చు.

కన్ను నొప్పి , మసకబారడం, రెండుగా కనిపించటం ఈ ఫంగస్ కు మరో సంకేతం. రోగులు కంటిలో వాపు మరియు నొప్పి మరియు కనురెప్పలు మూసుకు పొయిన్నట్టు  కూడా అనిపించవచ్చు . కొంతమంది రోగుల్లో, ఛాతీ నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలను  కూడా మనం గమనించాం. కోవిడ్ రోగులు  మరియు కోవిడ్ నుండి కోలుకున్నవారు కూడా ఇటువంటి  లక్షణాలు కనిపిస్తే , జాగ్రత్తగా ఉండాలి. తగు చికిత్స తీసుకోవాలి .

మ్యూకార్మైకోసిస్ కొరకు రోగ నిర్ధారణ పద్ధతి  మరియు చికిత్సవిధానం  ఏమిటి?

ఫంగస్ కారణంగా భాగం క్షీణించిందా లేదా అని అర్థం చేసుకోవడానికి మరియు ఎండోస్కొపీల(endoscopy) ద్వారా, మైక్రో బయాలజీ ల్యాబ్ లో నమూనాను పరీక్షించడానికి  శరీరంలోని భాగం యొక్క

(CT Scan) సిటి స్కాన్ చేస్తారు . ఒకవేళ పరీక్షలు ఫంగస్ కు పాజిటివ్ గా ఉన్నట్లయితే,  ఆ శరీర భాగానికి శస్త్రచికిత్స చేయాలి ,మరియు ఫంగస్ ని పూర్తిగా తొలగించాలి. శస్త్రచికిత్సతో పాటుగా, anti-fungal injection, Amphotericin B Injection – ఇది మళ్లీ పెరగకుండా చూడటం కొరకు ఉపయోగించబడుతుంది.

మార్కెట్లో రెండు రకాల ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. 

మొదటిది deoxycholate ఇది  కనీసం 50 సంవత్సరాలు గా ఉపయోగించబడింది. అయితే ఈ ఇంజెక్షన్ ‘నెఫ్రో టాక్సిక్’, అంటే ఇది రోగి మూత్రపిండాలపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. తక్కువ నెఫ్రో టాక్సిక్ అయిన రెండవ ఇంజెక్షన్ లిపోసోమల్(liposomal), కానీ ఇది చాలా ఖరీదైనది మరియు ఈ ఇంజెక్షన్ యొక్క ఒక రోజు చికిత్స ధర రూ.25,000 నుండి రూ.50,000 మధ్య ఉంటుంది. ఇతర సెకండ్  లైన్ మందులు ఇంజెక్షన్ ఇసువాకోనాజోల్ మరియు ఇంజెక్షన్ పోసాకోనాజోల్.

( injection azoleIsuvaconazole and Injection Posaconazole) – రెండూ చాలా ఖరీదైన మందులు.

మ్యూకార్మైకోసిస్ నిరోధించడానికి ఏమి చేయవచ్చు?

రోగులు వారి రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించాలి. మరియు వాటిని నియంత్రించాలి. అలాగే, స్టెరాయిడ్ ను  నిపుణుల పర్యవేక్షణలో అవసరం అయినంత మోతాదులో   ఉపయోగించండి. ఈ వ్యాధి ఒకరినుండి మరొకరికి స్పర్శ ద్వారా వ్యాప్తి చెందదు.

అయిన  ఆక్సిజన్ థెరపీ సమయంలో హ్యూమిడిఫైయర్లలో శుభ్రమైన, సూక్ష్మక్రిమిరహిత నీటిని

 (sterile water)  ఉపయోగించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.

అదేవిధంగా, బ్లాక్డ్ నోస్ యొక్క అన్ని కేసులను బాక్టీరియా సైనసైటిస్ గా పరిగణించవద్దు, మరిముఖ్యంగా ఇమ్యూనో-మాడ్యులేటర్ లపై ఇమ్యూనోసప్రెసర్ లు మరియు కోవిడ్-19 రోగుల సందర్భంలో ఫంగస్ etiology గుర్తించడానికి తగిన విధంగా  పరిశోధనలను  చెయ్యాలి .

 

About Author –

Dr. Venkat Raman Kola, Clinical Director, Yashoda Hospital, Hyderabad

best Critical Care doctor in hyderabad

Dr. Venkat Raman Kola

MD, DNB, IDCCM, EDIC
Clinical Director

X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567